మా తెలుగుతల్లికీ మల్లెపూదండ...

సాహిత్యపరంగా తెలుగుతల్లి అంటే తెలుగు ప్రజల అమ్మగా చిత్రీకరించబడిన, ప్రజామోదం పొందిన చిహ్నం.

మరింత తెలుసుకోవడానికి

నన్నయ్య

నన్నయ భట్టారకుడు(సా.శ.11వ శతాబ్ది) తెలుగు సాహిత్యంలో ’’’ఆదికవి’’’గా ప్రఖ్యాతుడయ్యాడు.నన్నయ సంస్కృతంలో తొలి తెలుగు వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి రచించారని భావిస్తారు.

మరింత తెలుసుకోవడానికి

తిక్కన

తిక్కన లేదా తిక్కన సోమయాజి (1205 - 1288). విక్రమసింహపురి (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి. అతనికి "కవి బ్రహ్మ", "ఉభయ కవిమిత్రుడు" అనే బిరుదులు ఉన్నాయి.

మరింత తెలుసుకోవడానికి

శ్రీ శ్రీ

శ్రీశ్రీ అని పిలవబడే శ్రీరంగం శ్రీనివాసరావు (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983) ప్రముఖ తెలుగు కవి. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ప్రసిద్ధుడు

మరింత తెలుసుకోవడానికి

అల్లసాని

ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల ఆశువుగా చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రథమ ప్రబంధముగా ప్రసిద్ధికెక్కినది.

మరింత తెలుసుకోవడానికి

బమ్మెర పోతన

బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. ఇతను సంస్కృతంలో ఉన్న శ్రీమద్భాగవతం ఆంధ్రీకరించి అతని జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతం లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.

మరింత తెలుసుకోవడానికి

పాల్కురికి సోమనాథుడు

పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీరశైవం వ్యాప్తికి కృషి చేశాడు. వీరశైవ సంప్రదాయంలో సోమనాధుడు శివుని ప్రమధ గణాలలో "భృంగి" అవతారం. అప్పటి ఇతర శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాధుడు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.

మరింత తెలుసుకోవడానికి

శ్రీనాథుడు

చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాథుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది.

మరింత తెలుసుకోవడానికి

గిడుగు వెంకట రామమూర్తి

తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి (ఆగష్టు 29, 1863 - జనవరి 22, 1940) . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.

మరింత తెలుసుకోవడానికి

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలతో.....


ఎస్.కె.వి.పి.&డా.కె.ఎస్.రాజు ఆర్ట్స్&సైన్స్ కళాశాల,పెనుగొండ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం & తెలుగుసంపద, సమైక్యభారతి సంస్థల సంయుక్త ఆధ్వర్యవంలో మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 28-29,2024 తేదీలలో పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని కళాశాల ఆవరణలో గురువుల, విశ్వవిద్యాలయాల పర్యవేక్షణలో జరిగే 2వ “‘అంతర్జాతీయ తెలుగు భాషా ఉత్సవాలు”-2024
(International Telugu Language Utsavams by Guides & Universities- iTELUGU 2024)

తెలుగు పరిశోధనా సమావేశాలకు పరిశోధనా పత్రాలకు ఆహ్వానం

(అతయ వసర్మైతే అంతర్జాలం దావ ర్జ పాల్గొనడానికి/సమర్ప ణకు అవకాశ్ం)
మీరు తెలుగులో పరిశోధన (PhD పట్టస కోసం/సాహిత్య వ్యయ పకంగా) చేసి ఉనాన రా? చేస్తునానరా? చెయ్యయ లి అనుకంటునాన రా? తెలుగు భాషాసాహిత్య ంపై కానీ, తెలుగుభాషపై కానీ ఎటువంటి పరిశోధనలు అవుతునాన యో తెలుస్తకోవ్యలి అనుకంటునాన రా? అయితే ఈ అవకాశ్ం మీకే! మీకోసమే!!

మీరు పరిశోధన పూరిుచేసినవ్యరు అయితే:-

మీ పరిశోధనా పత్రాన్ని, మీరు ఎన్నుకున్న అంశాన్ని, అంశాన్ని ఎలా ఎన్నుకున్నారు, అందులో వచ్చిన సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించేరు, చివరికి ఎలా విజయవంతంగా పూర్తి చేసేరు, తదుపరి పరిశోధకులకి ఎటువంటి సలాహాలు/సూచనలు ఇస్తారు అనేవి చెప్పవచ్చును.

మీరు పరిశోధన చేస్తున్నవారు అయితే :-

పైన చెప్పినట్లే మీరు ఏమి చేస్తున్నారు, ఎక్కడివరకు వచ్చింది, ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా, ఏదైనా సహాయం/సలహాలు ఆశిస్తున్నారా? వంటి విషయాలను పంచుకోవచ్చును. అనుభవజ్ఞుల మార్గదర్శకత్వం తీసుకోవచ్చును.

చేసిన/చేస్తున్న పరిశోధనల గురించి పత్రాల అంశాలు:

1) తెలుగు భాష/ తెలుగు సాహిత్యము/ తెలుగు భాషా చరిత్ర/తెలుగు కళలు
2) తెలుగు భాషా వ్యాప్తికి అంతర్జాలం, కంప్యూటర్ వంటి శాస్త్ర సాంకేతిక సాధనాల అవసరం- అవకాశాలు
3) తెలుగులో ఇంకా రావాల్సిన పరిశోధనలు, ఎన్నుకోవలసిన మిగిలిపోయిన/ముఖ్యమైన అంశాలు
4) తెలుగు వ్యాప్తికి చెయ్యవల్సిన కార్యాచరణ, సంస్థలు, వ్యక్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర
5) తెలుగుభాషలో వస్తున్న పరిశోధనల తులనాత్మక పరిశీలన
6) తెలుగులో వస్తున్న పరిశోధనలు ఇతర భాషల్లో వస్తున్న పరిశోధనల తారతమ్యాలు ఇంకా..ఇతర సంబంధమైనవి
పత్రాల వివరాలు -ఒక పేజీ ఆబ్స్త్రాక్ట్, 8 పేజీలకి మించకుండా పూర్తి పత్రం, అర్ధ పేజీ పరిచయం, ఒక ఫోటోతో ఫిబ్రవరి 10లోగా పంపవలసిన చిరునామా: contact@itelugu.in & murthyremilla@yahoo.com
UGC Rated journal లో బ్రచురణ, సమావేశాల పూరిిసమాచారానికి: www.itelugu.in
Download PDF

ప్రత్యక్ష ప్రసారం కోసం :

https://meet.google.com/sag-otqt-uvk

ప్రత్యక్ష ప్రసారం కోసం :

https://meet.google.com/iiy-ewau-smc

ప్రత్యక్ష ప్రసారం కోసం :

https://meet.google.com/bta-jxmc-cst

ప్రత్యక్ష ప్రసారం కోసం :

https://meet.google.com/duw-jgju-shq

ప్రత్యక్ష ప్రసారం కోసం :

https://meet.google.com/mmq-tayg-que

ప్రత్యక్ష ప్రసారం కోసం :

https://meet.google.com/jpu-hqoq-xjo

ప్రత్యక్ష ప్రసారం కోసం :

https://meet.google.com/yyw-wfoo-wyw

కార్యక్రమ వివరాలు, ఆన్లైన్ వీక్షణకు లంకెలు-మొదటి రోజు

28-02-2024 రాజరాజ నరేంద్ర ప్రాంగణం చిలుకూరి నారాయణరావు ప్రాంగణం
గం. 09:30 - 11:30
ప్రారంభోత్సవ సమావేశం : రాజరాజనరేంద్ర ప్రాంగణం
https://meet.google.com/sag-otqt-uvk
గం. 12:00 - 17:00
https://meet.google.com/iiy-ewau-smc
https://meet.google.com/bta-jxmc-cst
గం. 17:00 - 18:00
స్వరవీణాపాణి "సంగీతావధానం"
https://meet.google.com/duw-jgju-shq

కార్యక్రమ వివరాలు, ఆన్లైన్ వీక్షణకు లంకెలు-రెండవ రోజు

29-02-2024 రాజరాజ నరేంద్ర ప్రాంగణం చిలుకూరి నారాయణరావు ప్రాంగణం
గం. 10:00 - 13:00
https://meet.google.com/mmq-tayg-que
https://meet.google.com/jpu-hqoq-xjo
గం. 13:00 - 14:00
ముగింపు సమావేశం: రాజరాజనరేంద్ర ప్రాంగణం
https://meet.google.com/yyw-wfoo-wyw

ప్రాయోజకులు/సహాయకులు

సంప్రదించండి

contact@itelugu.in

telugusampada2023@gmail.com

telugusampada

తెలుగు సంపద